జిరాఫీ ముచ్చట్లు కొన్ని:-- యామిజాల జగదీశ్
 జంతువుల లోకంలో అతి ఎత్తయినది జిరాఫీ. 
ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే జిరాఫీలు అడివిలో ఉన్నట్టే ఇక్కడి జనం మధ్య వీటికంటూ స్వేచ్ఛగా తిరుగాడడానికి విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు.
జీరాఫీలలో మగవి 16 నుంచి 18 అడుగుల ఎత్తువరకూ ఉంటాయి. దాదాపు తొమ్మిది వందల కిలోల బరువుంటాయి.
అయితే ఆడ జిరాఫీలు మగవాటినే కన్నా ఎత్తులోనూ బరువులోనూ కాస్తంత తక్కూవగానే ఉంటాయి.
జిరాఫీ వెనుక కాళ్ళకన్నా ముందర కాళ్ళు  పది శాతం ఎక్కువ పొడవుంటాయి.
వేసే ఒక్కొక్క అడుగుకి మధ్య దూరం అడుగులవరకూ ఉంటుంది.
జిరాఫీల గుండె బరువు పది కిలోలుంటాయి.
జిరాఫీలలో కింది పొట్టను మినహాయిస్తే మీగిలిన శరీర భాగమంతటా మచ్చలుంటాయి. ఈ మచ్చలు అన్ని జిరాఫీలకు ఓ ప్రత్యేక సృష్టి.
పొడవైన మెడ కలిగి ఉండే జిరాఫీ పారే నదిలోనైనా తల వంచి నీటిని చాలా సులభంగా తాగుతుంది.
జిరాఫీ నాలుక 27 అంగుళాల పొడవుంటుంది. నీలం రంగులో ఉంటుంది నాలుక! ఈ పొడవాటి నాలుకతో జిరాఫీ సులభంగా ఆకులను అందుకుని తింటుంది.
జిరాఫీ సగటు జీవితకాలం 25 సంవత్సరాలు.
జిరాఫీలు తమను తాము కాపాడుకోవడానికి ఎంతో అప్రమత్తంగా ఉంటాయి. 
ఆడ జిరాఫీలు 14 నుంచి 15 నెలలపాటు గర్భాన్ని మోస్తాయి.
జిరాఫీలు పుట్టేటప్పుడు 1.8 మీటర్ల ఎత్తుంటాయి.
ఇవి పుట్టిన కొన్ని గంటలలోపే లేచి పరిగెడుతాయి. 
జిరాఫీ నిలబడే పిల్లను ఈనుతుంది. పుట్టే పిల్ల అంత ఎత్తు నుంచి నేల మీద పడినప్పటికీ వాటికి దెబ్బ తగలదు. తల్లి పొట్టలో ఉన్నంత కాలం పొందికగా ఒదిగి ఉండే జిరాఫీ పిల్ల నేల మీద పడిన తర్వాత అది లేచి నిలబడి పరిగెత్తడం వెనకుండే కారణాన్ని చూద్దాం....
లేచి నిలబడేటప్పుడు మోకాళ్ళను భూమ్మీద బలంగా అదిమిపెట్టి పైకి లేవలేని స్థితిలో దానిని తల్లి జిరాఫీ తన కాలితో పలుసార్లు కొడుతుంది. అప్పుడే పుట్టిన పిల్ల జిరాఫీని తల్లి జిరాఫీ ఇలా కాలితో తన్నడం చూడటానికి ఏమిటీ చర్య అనిపిస్తుంది. తల్లికి కాస్తంత కూడా కరుణ లేదా అనిపిస్తుంది. కానీ పిల్ల జిరాఫీ బతికుండటానికీ ఎక్కువ కాలం జీవించి ఉండటానికే తల్లి జిరాఫీ అలా చేస్తుంది.
పిల్ల జిరాఫీలను సింహం, చిరుతపులి వంటివి వేటాడి చంపుతాయి. చిన్న చిన్న కాళ్ళను నేలమీద నిలిపి పరిగెత్తకుంటే అవి క్రూరమృగాల దాడిలో చనిపోతాయి. కనుక ఇలా జరగకుండా ఉండాలంటే తల్లి తన కాలితో వాటిని తన్నకతప్పదు. అపఱపటికీ 25 నుంచి 50 శాతం జిరాఫీలు క్రూర జంతువుల దాడికి చనిపోతుంటాయి.
జిరాఫీలు శత్రువు నుంచి తమను తాము కాపాడుకోవడానికి కాళ్ళనే ఉపయోగిస్తాయి.
 కాళ్ళతో అవి బలంగా కొడతాయి. ఒక్కొక్కప్పుడు వీటి కాలి దెబ్బకు తట్టుకోలేక సింహం చనిపోతుందికూడా.
జిరాఫీ ప్రధాన ఆహారం ఆకులు. లేలేత కొమ్మలు. ఇవి పొద్దున్నే ఆకులను తినడానికి ఇష్టపడతాయి. రోజుకి ఇరవై తొమ్మిది కిలోల ఆకులను లాగించేస్తాయి. 
 పండ్లు‌, పువ్వులను కూడా ఇష్టపడి తినే జిరాఫీ బాగా నమిలి ఆపై నెమరేస్తాయి. ఒకవేళ ఏవైనా ఆకులను సరిగ్గా నమలకపోయుంటే వాటిని మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని నమిలే శక్తి జిరాఫీ ప్రత్యేకం.
మరొక విచిత్రమైన విషయమేమిటంటే ఇవి తరచూ నీరు తాగవు. ఒకసారి తాగిన నీరు ఓ వారం వరకూ సరిపోతుంది.కామెంట్‌లు