:శ్రీ గణేశ శరణం శరణం:-జెగ్గారి నిర్మల-తెలుగు భాషోపాధ్యాయురాలుజిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొండపాక జిల్లా: సిద్దిపేట

 కందం
శ్రీకరి ముఖ లంబోదర
ప్రాకటముగమమ్ముగావు ప్రస్తుతి జేతుమ్
మాకిల విఘ్నము జూపక
లోకేశ్వర రక్ష జేయు లోకము నంతన్
ఆ,వె
ఏకదంత పూజ్యలోక నాయక రార
నీకు పూజ జేయ నిత్య శుభము
వందనంబు లివిగొ సుందర గణనాథ
ఆదు కొనుము మమ్ము యాది దేవ
ఆ.వె
విఘ్న దోష హరణ విఘ్నేశ రావయ్య
కావు మయ్య యీక రోన నుండి
శరణు శరణు స్వామి శంబు తనయ రావ
కరిముఖ శుభ దాయ కరుణ మూర్తి
కామెంట్‌లు