పల్లికాయ :-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

 ఊడలమర్రి ని చూశాను
 పూడలు పట్టుక ఊగాను
 చిన్న గుట్టను చూశాను
 జారుడు బండలు జారాను

కంది చేనుకు పోయాను
కంది కాయలే తిన్నాను
పల్లి సేనుకు  పోయాను
పైన పూలను చూశాను

కాయల కై వెతికాను 
కనబడలేదు ఎటువైపు 
తాత వచ్చి చెప్పాడు
భూమిలో కాయలన్నాడు
కామెంట్‌లు