*బాల గేయం- గాంధీ తాత*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 బాపూజీ బాలల తాత
గాంధీజీ మన పెద్దల నేత
పేదల చూసిన మన తాత
కొల్లాయి గట్టిన మహానేత
బోసినవ్వుల  మన తాత
బాలల కిష్టం గాంధీ తాత
స్వాతంత్ర్యం కోసం జాతిపిత
సమస్త జనుల చేసెను జాగృత
ఒక త్రాటిపై నడిపించిన విజేత 
సత్యం అహింసల శాంతిదూత

కామెంట్‌లు