వరసిద్ధి వినాయక*: బెజగాం శ్రీజ,

 *సీసమాలిక*
పార్వతీమాతకు పరమేశ్వరులకును
ముద్దులతనయుడు ముచ్చటగను
విఘ్నాలుబాపియు వినయంబు పంచును
శ్రీసిద్ధిగణపయ్య సిరులనిచ్చు
మూషికవాహన ముల్లోకములచుట్టి
రక్షణజేయును రమ్యముగను
కొలచినవారికి కొంగుబంగారంబు
వరములనిచ్చును వసుధలోన
నవరాత్రిపూజలు నవనిలోనందుకో
మాబొజ్జగణపయ్య మధురముగను
ఏకదంతముతోడ లోకకళ్యాణంబు
చేసినవాడవు క్షేమమెరిగి
ప్రకృతిపురుషులకు వరమైనవాడవు
లంభోదరుండవు లక్షణముగ
*తేటగీతి*
భవితలోనిపుడుకరోనవ్యాధితరిమి
కష్టములుతొలగించుము గౌరవముగ
శాంతినేప్రసాదించియు సౌఖ్యముగను
దీవెనలనందజేయుము దైవముగను

కామెంట్‌లు