గణపతి ప్రార్ధన:---మచ్చ అనురాధ-జి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి-కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా.

 ఉత్సాహం
పండుగొచ్చె గణపతయ్య పారిరావ నెలుక పై,
కండు లేపె వ్యాధియంత కరుణ జూపు కావుమా! ,
గండముచ్చె కలిసి యుండ గగనమాయె పూజకున్ ,
చండి దేవి నందనుండు చంద్రశేకరుండు మీ,
తండ్రి కలిసి  పోరు సల్పి దయను జూపి బ్రోవుమా! ,
దండువోలె వచ్చి పూజ దండిగాను జేయగన్,
దండకమ్ము జేతుమయ్య దయను జూపి యేలుమా! ,
పండుగ నిల దేవలయును వక్రతుండ తందగా.
 
మానినీ వృత్తము
ముందుగ పూజలు మోదము తోడుత మోక్షము కోరుతు జేసెదమూ ,
చందిర తుండము చక్కని రూపము చల్లని చూపులు చందము లే,
కుందర మెట్టెద కుడ్ములు జేసెద కుడ్వ వినాయక  కూర్మితొరా!,
విందువు  నీవిల వేడెద మిమ్ముల వేల్పువు  నీవట విద్యలకున్ .
తేటగీతి 
తల్లిదండ్రి పాదాలకు దండమెట్టి,
భూప్రదక్షిణ జేసిన పుత్రుడీవు,
దేవ గణములకధిపతి దేవుడయ్యి,
ముందు పూజలందుకొనుము  ముదమునొప్ప.



కామెంట్‌లు