*వారసత్వం*:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 నా చిన్నారి నేస్తమా!
పుస్తకం తెరిచావుగా మరి
అందుకో అందులోని అనుభవాలతేనెఊటలు
సంతోషాల గేయాలను ఆలపించుకో
దృశ్య చిత్రాల విందును ఆరగించు
జ్ఞానవీచికల ఝరిని అవలోకించు
ఆలోచనల భృంగనాదాలు వినిపించుకో
సిధ్ధాంతాల మర్మవాదాలు సరిచూసుకో
ఇజాలజాతర నిజాలపాతర ఆకళింపుచేసుకో
చరిత్రల గాయాలను మాన్పుకో
పుస్తకం ఒక నిశ్శబ్ద గురువు
పుస్తకం తపస్సులో ఉన్న ఒక మౌని
పుస్తకం ఒక విజ్ఞానఖని
పుస్తకం ఒక జ్ఞానమణి
నా చిన్నారి నేస్తమా!
మేమిచ్చే ఏకైక వారసత్వం ఇదేసుమా!
.

కామెంట్‌లు