బాక్ స్పేస్ : - రాజేందర్ జింబో

 కొంతకాలం
 ఇంట్లో జీవితం స్తంభించిపోయింది
 పెద్దన్న చనిపోయినప్పుడు,
 అప్పుడు నేను పిల్లవాడిని 
 దాని ప్రభావం అంతగా తెలియదు
 టేప్ రికార్డర్ జీవితం లోకి వచ్చాక
పాజ్ అంటే ఏమిటో  తెలిసింది 
 టీవీలు జీవితంలోకి వచ్చిన తర్వాత 
పాజ్ బటన్ని  నొక్కడం 
నిత్య కృత్యం అయిపోయింది.
 జీవితాలు  పాజ్ కాకపోయినా 
 స్లో మోషన్ లోకి వెళ్లిపోతాయని 
ప్రకృతి గుర్తుచేసింది 
కంప్యూటర్ 'కీబోర్డ్ 'లో పాజ్ లేదు 
బ్యాక్ స్పేస్ ని వాడినప్పుడల్లా,
అలాంటి బటన్ 
జీవితంలోనూ ఒకటుంటే బాగుండునని
అమాయకంగా  అనిపిస్తూ ఉంటుంది 
పిల్లవాడిగా మారిపోవాలని
ఆరుద్ర,సీతాకోక చిలకలకై పరుగెత్తాలని.
కామెంట్‌లు