సంకల్పబలం: కె. ద్వారకానాథ్


  శివపురంలో  శివాలయ పూజారి గా వున్న  పరమహంస   భక్తి, శ్రద్దలతో శివలింగాన్ని పూజించేవాడు  .ఇతర రాష్ట్రాల నుండి   నడిచి తిరుమల వెళ్ళే భక్తులు శివాలయంలో బస చేసి రాత్రి  నిద్ర   పోయి  తెల్లవారగానే వెళ్లిపోయేవారు . కానీ వారికి  తగిన   వసతులు లేకున్నా సర్దుకుని వెళ్ళి పోయేవారు . ఇది గమనించిన   పరమహంస వారి కోసం ఒక  సత్రం , భోజన  వసతి    ఏర్పాటు చేయాలనే  ధృడసంకల్పం అతనిలో  నాటుకుపోయింది .  పరమహంసకు ఒక ఆలోచన వచ్చింది . అసలు నా కోరిక  తీరుతుందా.. లేదా ? అని తెలుసుకోవడానికి పక్క  ఊరిలో ఉన్న   జ్యోతీష్కుడు దివ్యేంద్రమహరాజ్ వద్దకు వెళ్ళి తన జాతకాన్ని చూడమన్నాడు . జోతీష్కుడు “ శివాలయ పూజారిగారు కూర్చోండి అని  కొన్ని  ప్రశ్నలు వేసి .దీర్ఘ౦గా ఆలోచించి   . మీకు  ఇప్పుడు  జాతకం వ్రాసి ఇవ్వలేను .  నాలుగు  రోజుల తర్వాత రండి . మీ కంటే ముందు ఇచ్చిన వారి జాతకాలు వ్రాయాలి .అని చెప్పి పంపేసి. ఇలాంటి సమస్య పూజారికి  వస్తుందనుకోలేదు .ఇతనికి జంతువు వలన మరణం సంభవిస్తుంది  ఈ జంతు  గండం ను౦డి ఎవ్వరూ తప్పించ లేరు . ఇతనికి ఆవిషయ౦ చెపితే ఇతను  మనశ్శాoతి   కోల్పోయి శివునికి సరిగ్గా పూజ చేయకపోవచ్చు . తనికి ఈ నాలుగు రోజుల్లో దేవుడు ఏమైనా ఇన్ని రోజులు   పూజా చేసినందుకు    ప్రాణభిక్ష   పెడతాడేమో  అని మనసులో అనుకున్నాడు .  పరమహంస  నడుచు కుంటూ వెళుతున్నాడు . ఇంతలో వర్షం మొదలైంది . నడకదారిలో వున్న ఒక పెద్ద చెట్టుకింద నిలబడ్డాడు వర్షం పెద్ద పెద్దగా  కురవడం మొదలుపెట్టింది.  పెద్ద మెరుపు ఆకాశంలో మెరిసింది . తలెత్తి చూశాడు పరమహంస చెట్టు  పైనుండి  మెల్లగా ఒక పెద్ద కొండ చిలువ తనపైకి రావడం చూశాడు . వెంటనే పరిగెత్తి  దూరంగావున్న మరో చెట్టు కి౦దకి పోవడం ఆకాశంలో  నుండి మెరుపుతో కూడిన పెద్ద శబ్దం తో ఒక పిడుగు   కొండ చిలువ  వున్న చెట్టు పై పడడంతో ఆపాము తో  సహా  చెట్టు  మాడి మసి   అయ్యి అది చచ్చిపోయింది . పరమహంస గట్టిగా ఊపిరి పీల్చుకుని వర్షం తగ్గాక ఊరికి చేరుకున్నాడు .  పరమహంస నాలుగు  రోజులు  గడిచాక  మళ్ళీ  జోతీష్కుడి దగ్గరకు వెళ్ళాడు .     అతన్ని  చూడగానే జోతీష్కుడు     ఆశ్చర్యం తో ఇతను ఎలా బతికాడు .? అసలు నేను ఎన్నో ఏళ్లుగా ఎందరికో  జాతకాలు పరిశీలించి వ్రాసాను . ఎక్కడాపొరపాటు జరగలేదు . అనుకుంటూ మళ్ళీ అతని జాతకం   పరిశీలించి   మరణ గండం ను౦డి ఎలా బయట పడ్డాడు .అని తనలో తాను అనుకుంటుండగా   .పరమహంస తనకు జరిగిన సంఘటన గురించి చెప్పాడు . అది విన్న  జ్యోతీష్కుడు పరమ హంసకు మనసులో గొప్ప  ధృడ సంకల్పం బలమే అతనికి ప్రాణగండం తప్పించింది . అతను భక్తి  తో దేవుని కి రోజు సేవలు చేస్తాడు .  శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నారు అందుకనే....     పదిమంది భక్తులకు అవసరమయ్యే    ,సౌకర్యాలు కలిగిన సత్రం కట్టించాలనుకున్నాడు . మానవ సేవే మాధవ  సేవ  అనుకున్న  అతడు  దేవుని కృప వల్ల బతికి బయటపడ్డాడు . నా  జ్యోతిష్య  గ్రహబలం కంటే అతని సంకల్ప  బలానికి   దైవ బలం    తోడైంది .అందువల్లే ఈ సంఘటన జరిగి అతను  బతికిపోయాడు .అని జోతిష్కుడు మనసులో   అనుకుని , ‘మీ  జాతకం  పరిశీలించాను .ఇక జాతక౦ వ్రాయాలసిన అవసరం లేదు . మీ  జాతకం  దివ్యంగా వుంది వెళ్ళండి . మీ కోరిక   త్వరలో  పూర్తి అవుతుంది ‘ ,ఇక మీరు సంతోషంగా వెళ్ళి రండి  అని పంపించి  వేశాడు . 


కామెంట్‌లు