వానాకాలం :-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

వానాకాలం వచ్చింది
వానలు బాగా తెచ్చింది
చెరువులు కుంటలు నింపింది
జలకళనే తెచ్చింది

 వాగులు ఎన్నో పొంగాయి
 దారులకడ్డం వచ్చాయి
 బడికి పోయే వాళ్ళకు
 అడ్డంగా నిలిచాయి

పిల్లలు బడికి పోవాలంటే 
వాగులు దాటి పోవాలి
భయాలును వీడాలి
చదవులు ఎన్నో నేర్వాలి
కామెంట్‌లు