కోసల దేశం కు మహారాజు దశరధుడు
కన్నబిడ్డలవలె కాపాడే ప్రజలను
సంతానము లేక బాధపడు చుండెను
పుత్రకామేష్టి యాగమే చేసెను
:: కోసల::
యాగ ఫలము చేత కొడుకులు జన్మించే
రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు
విలువిద్యలు వాళ్ళు ఇంపుగా నేర్చి రి
విశ్వామిత్రుని యాగ రక్షణ చేసిరి
:: కొసల ::
గురువుగారితోడా మిథిలను చేరిరి
శివధనస్సు చరిత్ర జనకుడే చెప్పను
అందరూ రాజులు భయపడి పోయిరి
రాముడు ధనస్సును తేరిపార చూసేను
:: కోసల::
ఎడమచేతితోడా ధనస్సును ఎత్తెను
కుడి చేతితోడా వింటి సంధించేను
బళ్ళు మని శబ్దంతో ధనస్సు విరిగిపోయే
సంతోషమున సీత రాముని చేరేను
:: కోసల::
శివధనుర్భంగం:::-::యెల్లు.అనురాధ రాజేశ్వర్ రెడ్డి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి