హృదయ భారం .:-వై నీరజారెడ్డి .--తెలుగు భాషోపాధ్యాయురాలు. జడ్పిహెచ్ఎస్ కుకునూరుపల్లి .
నడిచే జీవనగమనంలో , 
పోరాడే సమస్యలతో, 
ఎదురయ్యే ఆటంకాలతో,
 క్షణమొక యుగమైనా జీవితంతో, 

హృదయమె0త భారం.

 కలలుగన్న కన్నులకు కన్నీరే ఎదురైతే ,
అందమైన జీవితం లో, కటిక చీకటి ఆవ రిస్తే,

 హృదయమెంత భారం.

 ఎదలో ఆవేదన దొంతర,
 గుప్పెడు గుండెల్లో దాచిన, 
బడబాగ్ని జ్ఞాపకాలు, 
ఎదన0తా మెలిపెట్టే, మోయలేని వెతలతో,

 హృదయం ఎంత భారం. హృదయం ఎంత భారం.

కామెంట్‌లు