పాడుచేయకు* (బాలగేయం):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఉసిరిచెట్టు మీది ఉడతమ్మా
కాయకొరికి పాడు చేయకమ్మా
జామచెట్టు మీది చిలకమ్మా
పండుకొరికి పాడు చేయకమ్మా
మామిడిచెట్టు మీది కోతిబావా
కొమ్మలువిరిచి పాడు చేయకండీ
పొలములోన ఉన్న ఎలుకవీరుడా
ధాన్యము కొరికి పాడు చేయవద్దూ
ఉట్టిమీదికి ఎక్కిన పిల్లిమామయ్యా
పాలుతాగి పాడు చేయకయ్యా
చేపలగంపకాడి కుక్కబాబూ
చేపలుకొరికి పాడు చేయబోకూ!!

కామెంట్‌లు