కాళోజి..... ప్రేమ మూర్తి:-మచ్చ అనురాధ-జి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా.


 సీసమాలిక
తల్లి రమాబాయి తన యుండు  కాళోజి
తెలగాణ  ప్రజలకు తేజమితడు ,
అన్యాయములపైన నణచివే తలపైన
తిరిగియు పోరాడె  ధీరుడితడు,
తెలగాణ పక్షాన దీక్షతో నిలిచెరా
నైజాము నెదురించె నాయకుడుగ,
దోపిడీనరికట్టి  దుర్నీతి తొలగించె
పేదలపాలిటి ప్రేమమూర్తి,
సంఘ గొడవలను చక్కగా  నా గోడు
యని కవితలు రాసె యద్భుతమ్ము,
మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మరువవద్దు,
కాలమ్ము రాగానె కాటేసి తీరాలి
యని  పౌరుషము నింపె యందరికిని,
పరుల బాగు కొరకు పాటు బడిరి వారు
జీవితాంతము పోరుజేసినారు .
  తేటగీతి
తప్పుజేసి నిలువరాదు ధనము కొరకు,
వీర తెలగాణ నాదన్న వీరుడితడు ,
ప్రజల చైతన్య పరిచిన పరమ యోగి,
ప్రజల కవిగాను  పేరొందె ప్రస్తుతింతు.

కామెంట్‌లు