బాలూ : - యామిజాల జగదీశ్

విశాలమంత
నమ్మకాలిచ్చి
మమ్మల్ని దగా 
చేసుండక్కర్లేదు
అదృశ్యమై....!

ఇప్పుడేం
జరగడం లేదని?

మీ పాటలు 
వింటుంటే
మనసులోకొచ్చేస్తున్నారు
మీ పెదవులు పలికిన మాటలు
మమ్మల్ని
తాదాత్మ్యంలోకి
తీసుకుపోతాయి
కనుక
మీరు మమ్మల్ని
దగా చేశారని 
చెప్పడం 
నా తప్పున్నర తప్పవుతుంది

మద్రాసులో
మీరుండిన్న కామ్దార్ నగర్ కి
దగ్గర్లోనే మా ఇల్లు వివేకానంద వీధిలో
ఉండేది
ప్రత్యక్షంగా చూసిన 
సందర్భాలున్నాయి
కానీ
ఒక్కసారైనా
నేను మిమ్మల్ని కలిసింది లేదు
పలకరించిందిలేదు
మీ ఆటోగ్రాఫ్ తీసుకున్నదీ లేదు

ఇప్పుడెంతలా బాధపడినా
గడచిన క్షణాలు రావుగా

కనుక
మీ పాటలు వింటూ
సరిపెట్టుకోవలసిందే తప్ప
ప్రత్యామ్నాయం లేదు

❤️❤️❤️

కామెంట్‌లు