మంచి బాటకు ముళ్లు:--- మచ్చ అనురాధ--తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 సీసపద్యం
కౌరవుల్ బన్నిరి కపట కుట్రలనెన్నొ
శకుని మామనుగూడి శ్రద్ధతోడ
పాండు కుమారులు పాపమెరుంగక,
శూరులైనను నోడె జూదమందు ,
కాచిన పందెము   కట్టుకు వనవాస ,
యజ్ఞాతవాసము కరిగినారు ,
ధర్మరాజు నిలన  ధర్మము  తప్పక  ,
పాండవులందరు పడిరి పాట్లు .
తేటగీతి.
కృష్ణ భగవానుడే దిక్కు తృష్ణ దీర్చ
కర్మ  ఫలితమ్ములీరీతి కలుగు చుండు ,
మంచి బాటకు ముళ్లెన్నొ మనుగడందు ,
యిహము పరమందు యిక్కట్లు  యివ్విధమును.

కామెంట్‌లు