గురువులకు వందనం :జగదీశ్ యామిజాల
అక్షర జ్ఞానంతో
అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి 
జీవితపయనంలో
వెలుగు జాడలు పరచి
నడిపించే గురువులకు
వందనం

తెలియనివెన్నో
తెలియచేస్తూ
ఆలోచనా శక్తికి పదునుపెట్టి
అడుగులు వేయించే
గురువులకు వందనం

భయాన్ని తరిమికొట్టి
ప్రశ్నించే తత్త్వాన్ని పెంచి
తెలుసుకుకోవాలనే
జిజ్ఞాసను పెంచి
అక్షరయానంలో
ఆనందంగా 
హుందాగా 
నడిపించే గురువులకు
వందనం 
శిరస్సు వంచి వందనం

విద్యాదానం
అమూల్యమని 
చేతలలో చూపించి
పది మందికీ 
పనికొచ్చేలా చేసే
గురువులకిదే
మా వందనం
పాదాభివందనం
 

కామెంట్‌లు