*మానవ నాగరికతకు కుమ్మరి తొలిమెట్టు కుండ ఆయువు పట్టు*

 కుమ్మరులు ఆదినుండి  శ్రమజీవులే కాకుండా అద్భుతమైన కళాకారులనీ వీరి వృత్తి పవిత్రమైనదనీ పుట్టుకనుంచి చావు వరకు మట్టి కుండలతో మానవజీవితం పెనవేసుకుందనీ పర్యావరణ పరిరక్షణకు వీరి మట్టి పాత్రలు అనుకూలమైనవనీ కుమ్మర పురాణం వీరి చరిత్ర సంస్కృతికి అద్దంపడుతుందనీ కుమ్మర వృత్తి పవిత్రమైనదనీ పరిరక్షణ పౌర సమాజ బాధ్యత అని ఉస్మానియావిశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు *ప్రముఖ పురాణ పరిశోధకులు డాక్టర్ ననుమాసస్వామి* గారు అన్నారు
    తేది 12న సాయంత్రం 6నుంచి8  గం.ల వరకు *తెలంగాణ కుమ్మర సంఘం రి.నెం.880/2014, తెలంగాణ వివేక రచయితల సంఘం రి.నెం. 40/2009 మరియు బిసి వాయిస్ సామాజిక సాంస్కృతిక వేదిక*  సంస్థల ఆధ్వర్యంలో  *"కుమ్మరి పురాణం ఇతిహాస అంశాలు పరిశీలన"*  అను అంశంపై జాతీయ అంతర్జాల సదస్సు జరిగింది.
 ఈ సమావేశంలో *ప్రొఫెసర్  ననుమాసస్వామి*  ముఖ్య అతిథిగా మాట్లాడుతూ కుమ్మ వృత్తి పురాణంలో కుమ్మరవృత్తి పుట్టు పూర్వోత్తరాలున్నాయనీ కుమ్మరుల చరిత్ర గొప్పదనీ తెల్పారు. వక్తలుగా *డా.జనపాల శంకరయ్య, మలిశెట్టి కుమార్ లు* ప్రసంగిస్తూ ప్రాచీనం నుంచి మట్టిపాత్రలే వాడామనీ మట్టిపాత్రలే ఆరోగ్యమనీ ప్లాస్టిక్ పూర్తి నిశేధం జరుగాలనీ, ప్రభత్వాలు కుమ్మరులపై పూర్తిస్థాయిలో అధ్యయనం జరిపి ప్రతి కుటుంబానికి విద్యుత్ చక్రంతో పాటుగా 10లక్షలు ఇవ్వాలని తెలంగాణలో 5వేల కోట్లు కెటాయించి సర్వతో కుమ్మరాభివృద్ధికి తోడ్పడాలనీ అన్నారు. అతిథులుగా **తెలంగాణ కుమ్మర సంఘం అధ్యక్షులు నేదునూరి కనకయ్య,ప్రధానకార్యదర్శి కొల్లూరి అనిల్ కుమార్లు ,*  
మాట్లాడుతూ కుమ్మరం వొకేషనల్ & డిప్లమా కోర్సుల్లో ప్రవేశ పెట్టాలని కుమ్మరుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు.
   ఈ కార్యక్రమానికి *మేధావుల విభాగం కన్వీనర్ డా.వాసరవేణి పర్శరాములు అధ్యక్షత* వహించారు.
 బహుజన సాహిత్య ప్రక్రియ పరివ్యాప్తిద్వారా వృత్తి పురాణాల పరిజ్ఞానం,అవగాహన కల్పించాలనీ,కుమ్మర సాహిత్య,సాంస్కృతిక వైభవం పుస్తకాల రూపంలో వెలగులోకి తేవాలని తీర్మానించనైనది.
కార్యక్రమంలో
 మలికంటి సిద్దయ్య, నమిలికొండ ప్రభాకర్,మలికంటి వెంకన్న జే ప్రవీణ్ ఎన్ శంకర్ నంపెళ్ళీ శ్రీనివాస్ ఎన్ శంకర్ ఎస్ శ్రీనివాస్ ఎలగందుల వెంకన్న ఎం అజయ్ కుమార్ జి వీరయ్య
 ,అన్నవరం దేవేందర్,ఎన్. కనకయ్య,కె.అనిల్ కుమార్,బూర దేవానందం,మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు