వ్యక్తిత్వం.:తాటి కోల పద్మావతి గుంటూరు.

 శీతాకాలం రాగానే ఒక పక్షి కనిపిస్తుంది. అదే కోకిల దాని రంగు నల్లగా ఉండవచ్చు. దాని కూతతో శీతాకాలం వచ్చిందని తెలుస్తుంది. తన పలుకులు తానే పలుకుతుంది. అది స్వతంత్రంగా ఉంటుంది.
మన పరిసరాలలో మరొక పక్షి కనిపిస్తుంది. దాని వర్ణం ఆకుపచ్చ, ముక్కు ఎర్రగా ఉంటుంది. ఇది కూడా చక్కని పలుకులు పలుకుతుంది. కానీ కానీ ఇతరులు చెప్పిన మాటలను అనుసరించి పలుకుతుంది. ఎవరు ఏం మాటలు చెబితే ఆ మాటలే పలుకుతుంది. దానివలన దాని వ్యక్తిత్వం కోల్పోతుంది. ఉదాహరణకు, దొంగ సాన్నిధ్యంలో పెరిగిన చిలుక, సాదు సాన్నిధ్యంలో లో పెరిగిన చిలుక పలుకులు కథ మనకు గుర్తుకు వస్తుంది. అందువలన కోకిలల జీవించాలా? లేదా చిలుక లాగానా అని మనము గ్రహించి మనము వ్యవహరిస్తే మన జీవితం ధన్యం సుఖాంతం అవుతుంది అదే వ్యక్తిత్వం.
మందర చెప్పుడు మాటలు విని కైకేయి తన వ్యక్తిత్వమే కాకా దశరధుని కుటుంబం కూడా కష్టనష్టములు పాలైంది.
బోటికి మాటే ప్రాణం. అని అని విజ్ఞులు అంటారు వాస్తవం కాదా.

కామెంట్‌లు