కానీ
పిల్లల చదువుల నిధులు దారి మళ్లిస్తున్నారు
చదువులు గాలికి వదిలేస్తున్నారు !!
ఇంటికి నాలుగు స్తంభాలు
నాలుగు గదులు నిర్మిస్తున్నారు
కానీ
పిల్లల్ని నలుగురిలో నవ్వుల పాలు చేస్తున్నారు
నాలుగు అక్షరాలు నేర్పకుండా చేస్తున్నారు!?
ఇంటిని అంతస్తు పై అంతస్తు వేస్తున్నారు!?
కానీ
పిల్లలను పై చదువులకు
పనికి రాకుండా చేస్తున్నారు!?
మనకు ఇల్లు కాదు పిల్లలు కావాలి
మనకు పిల్లలే కళ్ళు కావాలి !?
వంశం కాదు పిల్లల భవిష్యత్తు కావాలి!?
ఎత్తుకు ఎదగాల్సిందీ
గదులు కాదు పిల్లలు
పిల్లల చదువులు!?
నిర్మించాల్సిందీ ఇల్లు కాదు
పిల్లల్ని
పిల్లల చదువుల్నీ !?
***********************************
Sunitapratap, palem
Teacher,8309529273
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి