ఆట వెలది :-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు

 మంచం -బాల గేయం 
ఎంతో మంచిది మంచము 
పడుకుందాం కొంచెము  
విశ్రాంతిచ్చే సాధనము 
విజయపు కలలు కందాము !
మంచం శుభ్రంగా ఉంచు 
మాసిన దుప్పటి తొలగించు 
మంచం మీద అన్నం తినకు 
మంచిదికాదు ఎక్కి తొక్కకు!
ఎన్నో రకాలు మంచాలు 
స్థాయిని బట్టి తేడాలు 
బంగరు వెండి మంచాలు 
రాజరికానికి చిహ్నములు!
డబుల్ కాట్ మహనాగరికం 
మడతమంచాలు జ్ఞాపకాలు 
నవారు నులక పేదలకు 
వైరు మంచం మధ్య తరగతి
మంచం కింద దొంగాటలురోయ్  
మరువకు బాల్యం గురుతులు 
తినగానే మంచం ఎక్కకురోయ్  
మన సంస్కృతిని మరువకు!
ఎం. వి. ఉమాదేవి.
జోరు వాన లోన చొక్కాలు వీడియు 
విఘ్నరాజు గప్పి వీరి భక్తి 
వయసు చిన్న దైన వారిభావన గొప్ప 
నమ్మకమ్ము మేలు నటనకన్న!
తేట గీతి 
బాల సేవితు డగుచును బాహుబలిగ
విఘ్న రాజుకు నెదురేది విశ్వమందు
భావి తరముల గాపాడు భవ్యముగను 
విద్య లందును సాయము విజయమిచ్చు!

కామెంట్‌లు