కనువిప్పు...అచ్యుతుని రాజ్యశ్రీ

 "గోపీ!బుజ్జిగా!తొమ్మిది దాటింది. పడుకో ఇంక.5కల్లా  లేపుతా.బడి బస్సు  7కల్లా  వస్తుంది. అది మిస్ అయితే నీవింక ఇంటి కే అంకితం. అంతదూరం మీనాన్న తీసుకుని వెళ్లరు." "అమ్మా ప్లీజ్!రేపు  శనివారమేగదా?పాట ఆట క్విజ్ డ్రాయింగ్  తప్ప సబ్జెక్టులు ఉండవు.ఈక్రైం డిటెక్టివ్ సీరియల్ చూసి పడుకుంటాను." ఇంతలో భర్త రామం అరిచాడు "అబ్బబ్బ!సీతా!వాడిని ఎందుకు సతాయిస్తావు?వీక్ ఎండ్ కదా?మేమిద్దరం కాసేపు ఎంజాయ్ చేస్తాం."భర్త మాటలకు ఏమీఅనలేక పోయింది సీత.అతనుసాఫ్ట్వేర్ కాబట్టి శని ఆది బాగా  ఎంజాయ్ చేయాలంటాడు.పోనీలే అని వదిలేస్తే శని ఆదివారం అంతా టి.వి.కిఅతుక్కుపోయి గోపి హోంవర్క్ పూర్తిచేయడు. ఆదివారం సాయంత్రం కూచుని  అంతా గబగబా గీకేస్తాడు.ఆమరునాడు స్లిప్ టెస్ట్ కి ముక్కున పట్టి తయారు అవుతాడు.సీతకి అది నచ్చదు.6వక్లాస్ నించే పిల్లలను పట్టుకుని పునాది వేస్తే  టెన్త్ లో తేలికగా గట్టు ఎక్కుతారని ఆమె అభిప్రాయం. ఒక టీచర్ గా ఆమె అనుభవం. భర్త పూర్తిగా వ్యతిరేకం. పిల్లలను చదువు పేరు తో బెదరగొట్టగూడదు.ఇప్పుడు సాఫ్ట్వేర్ కుదేలైంది.సామర్థ్యం తెలివి సమయస్ఫూర్తితో ఏరంగంలోనైనా రాణించవచ్చు  అని అతని అభిప్రాయం. గాలిలో దీపంపెట్టి దేవుడా నీమహిమ అనగూడదు అంటుంది సీత.కొడుకుని వెనకేసుకొచ్చే భర్త తో తగువు పడుతుంది. ఒక టీచర్ గా తనుబిజీ! ఆరోజు అర్ధరాత్రి కెవ్వున కేకవేస్తూ లేచిఅరవసాగాడు గోపి."అమ్మా!దెయ్యం..డ్రాగన్!నోరు తెరిచి  నామీదకు వస్తోంది!?": 5వక్లాస్ చదువుతున్న గోపి అరుపుకి సీత పరుగెత్తి వచ్చింది. వాడి ఒళ్ళు అంతా చెమటతో తడిసిపోయింది. "ఏమండీ!వీడికి జ్వరం వచ్చింది. " "అమ్మో!ఆదెయ్యం నామీదపడుతోంది"వాడి గావు కేకలకి  రామం లేచి రంకెలు వేయసాగాడు."పిరికి సన్యాసి వెధవా!" శనివారం బడిఎగ్గొట్టాడు.సోమవారం బడికి పోగూడదని  బద్దకంగానే లేచాడు. సీత  వాడిని ఆరోజు  తనతోపాటు బడికి తీసుకుని వెళ్ళింది. ఆమె కిలోమీటర్ దూరం నడిచే వెళ్లుతుంది. వాడిని కావాలనే నడిపిస్తోంది.దారిలో చిన్న చాయ్ షాపు లో కప్పులు కడుగుతున్న పిల్లాడు ఇటుకలు మోసే పిల్లలు  చిన్న పిల్లలను ఆడిస్తూ వంటచేస్తున్న ఆ అపార్ట్మెంట్ వాచ్మన్ కూతురిని సీత పలకరిస్తూ నడుస్తోంది. "ఆంటీ! మీరు చూపించిన కుట్టుసెంటర్ లో చేరాను". "టీచర్!మీరు ఇచ్చిన పూల కూరగాయల విత్తులు చక్కగా పూలు కాయలు ఇస్తున్నాయి."గోపీ కి తల్లి  గొప్ప తనం అర్థం అయింది. 7వక్లాస్ దాకా ఉన్న ఆ ప్రైవేటు బడిలో అమ్మ హెచ్. ఎం.సగంజీతం బీద పిల్లలకు కావలసిన నూనె సబ్బు వారానికోసారి పళ్లు పంచుతుంది.ఒక అంధుడు కర్రసాయంతో బస్సు రాగానే ఎక్కటం చూసి బిత్తరపోయాడు గోపి. బడిలో  సోషల్ టీచర్ కార్గిల్ యుద్ధం గూర్చి  75ఏళ్ళ వజ్రోత్సవాలగూర్చి విన్నాడు. ఆసాయంత్రం అమ్మ తో నడుస్తూ తనలోతనే అనుకోసాగాడు."నేను ఇన్ని వసతులు సౌకర్యాలు పొందుతూ కష్టం అంటే తెలీకుండా ఉన్నాను.ఆపిల్లలతో పోలిస్తే నేను అదృష్టవంతుడిని.అమ్మ చెప్పిన మాట విని బాగా చదివి గొప్పవాడిని అవుతాను." ఆరాత్రి  8గంటలకే నిద్రపోయాడు. తెల్లారి 5 కే లేచాడు.పుస్తకాలు సర్దుకుని స్నానం ముగించి  ఆరున్నర కల్లా  రెడీగా ఉన్న  గోపీని చూసి అమ్మ నవ్వుకుంది.
కామెంట్‌లు