ఆచరణ యోగ్యమైన సూచనలు.: సేకరణ. తాటి కోల పద్మావతి గుంటూరు.


 ఉదయం లేవగానే మీ ఇష్టదైవాన్ని స్మరించుకుని ఒక లీటరు రాగి చెంబుతో నీళ్లు తాగవలెను.

ఇలా చేయడం వలన మంత్ర జలాన్ని తాగినంత సాఫల్యం కలుగును. తరువాత కనీసం 12 సార్లు గుంజీలు తీయవలెను.

ఉదయం లేవగానే పక్షుల కిలకిలారావాలు విన్న వెంటనే మనము చెట్ల దగ్గరకు గాని లేదా డాబా పైన గాని నడిచి పోవునప్పుడు పక్షులకు ఆహారం కొరకు పిడికెడు ధాన్యం వేయాలి.

పక్షుల కొరకు డాబా పైన జంతువుల కొరకు వరండాలో దాహం తీర్చుట కు ఒక పాత్రలో నీళ్లు పెట్టాలి.

మనము ఎల్లవేళలా మన పని చేసుకొనుచూ మన ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. మరియు సహనము ఓర్పు , శాంతి కలిగి పరులు దూషించిన వారి క్షేమమే కోరాలి.

ప్రతి ఒక్కరూ సంవత్సరమునకు ఒక క్షణమైననూ నాటాలి. నాటిన తరువాత సంరక్షణ కూడా చేయాలి. పిల్లికి కుక్కకు అన్నం వేయాలి.

మన పెద్దల వద్ద ప్రతిరోజు ఆశీస్సులు తీసుకొని వారికి తగినంత సదుపాయములు కల్పించి వారి మన్ననలు పొందాలి. రోజుకు 15 నిమిషాలు వారి ఆరోగ్య విషయములు, ఆహార విషయంలో చర్చించి తగిన విధంగా మాట్లాడాలి.


కామెంట్‌లు