దయాగుణం:-పెందోట వెంకటేశ్వర్లు

చిన్న చేప పిల్లరా
పైకి పైకి ఎగిరేరా
గాలి వీయసాగెరా
రాయి పైన పడెనురా

చిన్న దెబ్బ తాకేరా
చిన్న బాలుడు చూసేరా
అయ్యో పాపం అంటూనే
డబ్బాలోన వేసెరా

గాయానికి మందు పూసేరా
ఆహార మింత వేసెరా
కోలుకున్న చేపరా
తిరిగి ఎగర వట్టెరా

డబ్బాలోని చేపను
చెరువు లోన వెడిచెరా
కామెంట్‌లు