ప్రకృతి బంధం: - అన్నాడి జ్యోతి--సిద్దిపేట‌.

ఆకు పచ్చని తోట‌ 
రంగురంగుల పూలు
ప్రకృతమ్మ హృదిన పరచుకున్న తీరు
అందమైన పూలు ఆనందమందిస్తు
 సువాసనల గుబాళింపు ఆస్వాదిస్తున్న కొలది
 మదిపులకరిస్తూ ఊపిరి ఊయలలూగుతుంది.

గలగల పారుతున్న జలపాతాల 
సవ్వడులు కళ్ళముందు నిలిచినపుడు
పచ్చని చెట‌్లతో నిండిన 
ప్రవహిస్తున్న నదీమతల్లి
నదీమతల్లి ఒడిన కానవచ్చిన 
పచ్చనివృక్ష ప్రతిబింబాలు
తిలకిస్తుంటే మనసు పరవశిస్తూ
ఊపిరి ఊయలూగుతుంది.

ఎండ వేడిని తాళలేకున్నప్పుడు
వరుణుడు కరుణించి చిరుజల్లు కురిపిస్తే 
ఆ చల్లదనంతో ఊపిరి ఊయలలూగుతుంది.

వాడిపోతున్న మొక్కకు నీళ్ళుపోసి బ్రతికిస్తే 
ఏపుగాఎదిగిన చెట‌్టును చూసి ఊపిరి ఊయలలూగుతుంది.
మదిలో నిలిచిన మానసికానంద దృశ్యాలు
 అప్పుడప్పుడూ పలకరిస్తుంటే ఊపిరి ఊయల పల్లకీలో విహరిస్తుంది.
   
కామెంట్‌లు