బడిగుడి దారిలొ పిల్లలు:- త్రిపురారి పద్మ--జనగామ.

గణగణ గంటల మోతలు
గుణగుణ పిల్లల పరుగులు

చకచక సాగిన పదములు
పకపక నవ్విన చిన్నలు

సరసర సాగిన రాతలు
బిరబిర వేసిన గీతలు

మరిమరి వేచిన చదువులు
సరిసరి పూచిన పువ్వులు

సడిదడి కట్టిన పిల్లలు
వడివడి చదువుల బాటలు

బడిగుడి దారిలొ బాలలు
మదిమది నిండిన కాంతులు

మురిసిన గురువుల మనసులు
మెరిసెను భారతి కన్నులు.

         

కామెంట్‌లు