సమయం విలువ.:-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్.

 గుంటూరు పట్టణంలో లలిత అనే వితంతువు తనకుమారుడు మురళితో జీవిస్తుండేది.మురళి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.ఆటలపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో,చదువులో వెనుక పడటంతో మురళి వాళ్ళ అమ్మ అతన్ని ట్యూషన్ కుపంపసాగింది.
సంక్రాంతి పండుగకు లలితను మురళినీ తనఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు మురళి వాళ్ళమామయ్య.'అక్కా మురళి ఎలా చదువు తున్నాడు' అన్నాడు మురళి మామయ్య.'ఏంచెప్పనురా!తమ్ముడు ఆటలపైన ఉన్న ఆసక్తి వాడికి చదువు పైనలేదు  మార్కులు బాగా తగ్గిపోయాయి అందుకే ట్యుషన్ కు పంపుతున్నాను అయినా ఫలితం కనిపించడంలేదు'అంది లలిత.నువ్వు దిగులుపడక వాడికి సమయం విలువ నేను తెలియజేస్తాను'అన్నాడు లలిత తమ్ముడు.
మామయ్య వాళ్ళ సైకిల్ తో ఊరిలో తోక్కుతూ పండుగ మూడురోజులు సంతోషంగాగడిపి, తిరుగుప్రయాణానికి సిధ్ధమౌతున్న మురళిని పిలిచిన వాళ్ళమామయ్య'అల్లుడు ఇప్పుడు నీవయసు ఒక సంవత్సరం తగ్గాలి ఏదైనామార్గంఉందా'అన్నాడు' మామయ్య గడచినకాలం తిరిగి పొందడం అసాధ్యం'అన్నాడు మురళి.'అల్లుడు నీకు తెలియకుండా ఎంతసమయం వృధాచేస్తున్నావో!ట్యూషన్ పోవడానికి నడక సమయం అరగంట రావడానికి అరగంట ట్యూషన్ సమయం గంట.అంటే వారంలో ఆరురోజులు దాదాపు పన్నేండుగంటల సమయంవృధాచేస్తున్నావు.నెలకు నలభై ఎనిమిది గంటలసమీయం వృధా, నెలకు ఐదు వందల ట్యూషన్ ఫీజు అంటే సంవత్సరానికి ఆరువేలు అనవసరమైన కర్చుచేస్తున్నావు,టీచర్ పాఠం చెపుతున్నిప్పుడు  ఏకాగ్రతతో మనసు పెట్టి శ్రధ్ధగా పాఠంవింటే ఇంత సమయం,ధనం వృధాకాదుగా? ట్యూషన్ లేకుంటే రోజు దానికి వినియోగించే సమయం నీవు ఆడుకోవచ్చు,ట్యూషన్ కు సంవత్సరానికి చెల్లించే ధనం ఆరు వేలరూపాయలతో మంచి సైకిల్ నువ్వు కొనుగోలు చేసుకుని ప్రతిదినందానిపై నువ్వు  పాఠశాలకు వెళ్ళవచ్చు ఇన్నింటికి కారణం నువ్వు సరిగ్గా చదవకపోవడమేకారణం.వైద్యుడు ఇచ్చేఔషధం చేదుగా బాధగాఉంటుంది కాని అది శరీరానికి స్వస్ధత కలిగిస్తుంది. విద్యకూడా అంతే చదివేసమయంలో కష్టమనిపిస్తుంది చదివి ఉత్తిర్ణత సాధిస్తే జీవితినికి బంగారు బాట వేస్తుంది.నీవంటి తెలివైన విద్యార్ధి నేటి ఆటలసుఖాన్ని ఆసించకూడదు,ముందుచూపుతో పట్టుదలగా చదివి మంచి ఫలితాలు సాధించి రేపటి సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలి'అన్నాడు.
తనమామయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించి శ్రధ్ధగా చదువుతూ,అన్నింట పాఠశాలలోనే ఉత్తమ ప్రధమ విద్యార్ధిగా గుర్తింపు పొందాడు మురళి.

కామెంట్‌లు