తిరగలి - బాలగేయం :-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు

తిరుగుతుంది తిరుగుతుంది 
రాతి తిరగలి 
పిండి విసిరి చూపుతుంది 
చేతి తిరగలి 

పురాతన పనిముట్టు ఇదేనండి 
రాతి తోటి మిక్సీని చేసిరండి 
పప్పులన్నీ  పొట్టు తీసుకోవచ్చండి 
రాగి సజ్జ పిండి తోటి రొట్టె లండీ!

పల్లెటూరులో నేటికీ ప్రత్యక్షo గా 
కందిపొడి సున్నిపిండి విసురుతుందిగా 
రెండురాళ్ళ మధ్యలోను నలిగే సూత్రం 
ఆధారం రెండు పిడులు మధ్యలో పైనాను !!

తిరగలి పాటలు పాడుతూ విసురుతారు 
తీయని కమ్మని రొట్టెలు చేస్తారు!!

కామెంట్‌లు