చిన్నా పెద్దా అందరికీ ఇష్టమైన సీతాకోకచిలుకల గురించి కొన్ని సంగతులు తెలుసుకోవాలనుకున్నప్పుడే ఇవి తెలిసాయి....
ప్రకృతి పరిస్థితులు సవ్యంగా ఉందా లేదా అనేది సీతాకోకచిలుకలను బట్టీ తెలుసుకోవచ్చు. ప్రకృతి సమతుల్యం దెబ్బతిన్న చోట సీతాకోకచిలుకలు ఉండవు.
ఆహార గొలుసుకట్టులో సీతాకోకచిలుకలు, క్రిమికీటకాదులు, పక్షులు, సాలీడు, తొండ, కప్ప వంటివి ముఖ్యమవుతున్నాయి.
తేనెటీగలు, సీతాకోకచిలుకల వంటివి లేకుంటే మకరంద సేకరణ జరిగే ప్రక్తే లేదు. ఈ సేకరణ లేకుంటే స్థావరాల ఉత్పత్తి ఉండదు.
తమిళనాడులో ఇప్పటివరకూ 324 రకాల సీతాకోకచిలుకలను కనుగొన్నారు. వీటిలో మూడో వంతు కోయంబత్తూరులోని కల్లారిలో ఉన్నట్టు అధ్యయనం ద్వారా తెలూసుకున్నారు.
తమిళనాడు బట్టర్ ఫ్లయ్ సొసైటీ (టిఎన్బీఎస్) 2014 మొదలుకుని 2019 వరకు అయిదేళ్ళ కాలంలో సీతాకోకలెన్ని ఉన్నాయోనని లెక్కించే పనులు జరిగాయి.
కోవై మేట్టుపాళయం నుంచి 13కిలోమీటర్ల
దూరంలో ఉన్న కల్లారిలో వర్షం అధికంగాన ఉంటుంది. ఇక్కడి శీతోష్ణ స్థితి కోసం, ఆహారంకోసం ఏర్కాడు, కొల్లిమలై, పచ్చమలై వంటి ప్రాంతాలలో సెప్టెంబర్ - అక్టోబర్ నెలలలో సీతాకోకచిలుకలు ఇతర ప్రాంతాలకు వలస పోతాయని అధ్యయనాలు తెలిపాయి.ళ ఇలా వలస పోయేటప్పుడు ఒక్కొ సీతాకోకచిలుక 200 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తాయి.
సూర్యరశ్మి బాగా ఉన్న ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య ఉన్న కాలంలోనే ఇవి వలస పోతాయి. రాత్రిపూట ఇవి విశ్రాంతి తీసుకుంటాయి.
సీతాకోకచిలుకలలో బ్లూ టైగర్, డార్క్ బ్లూ టైగర్, కామన్ గ్రో, డబుల్ బ్యాండడ్ గ్రో వంటి సీతాకోకచిలుక రకాలు ప్రధానమైనవి.
వీటి తర్వాతి స్థాయి సీతాకోకాచిలుకలు ఏప్రిల్ - మే నెలలలో తూర్పు పర్వత శ్రేణులు మాత్రమే వలస వెళ్ళి మళ్ళీ వెనక్కు తిరిగొస్తాయి.
కామన్ బ్యాండడ్ పీకాక్, లెస్సర్ ఆల్బట్రాస్, రెడ్ స్పేడ్ డ్యూక్, యెల్లో ప్రీస్టట్ బ్లేడ్ వంటి సీతాకోకచిలుకలు అరుదైనవి. ఇవి కల్లారిలో సంతానోత్పత్తి చేస్తాయి. కల్లారు అటవీ ప్రాంతంలో జరిపిన పరిశోధనలో 200 రకాల సీతాకోకచిలుకలున్నట్టు తేలింది.
సీతాకోకచిలుకలలో ప్లయిన్ టైగర్ విషపూరితమైనవి. వీటిని పక్షులు తినవు. డెనాయిడ్ ఎగ్ ఫ్లయ్ (ఆడవి), తమిళ్ లేస్వింగ్ వంటి సీతాకోకచిలుకలు సాధారణమైనవి. ఇవి విషపూరితం కావు. ప్లయిన్ టైగర్ వంటివి రూపంలో మిగిలినవాటికి భిన్నంగా ఉంటాయి. కామన్ రోస్ , క్రిమ్సన్ రోస్ వంటివి కూడా విషపూరితమే. కామన్ మార్మన్ (ఆడవి) కాస్త భోన్నంగా ఉంటాయి. శత్రువుల నుంచి తప్పించుకునే శక్తి వీటికుంటాయి.
స్కిప్పర్స్ కుటుంబానికి చెందిన సీతాకోకచిలుకలు అతి వేగంగా ఎగురుతాయి. తమకు ఆపద పొంచి ఉందని తెలిస్తే సంధించిన బాణంలా అవి మరింత వేగంగా ఎగురుకుంటూ పోతాయి.
కొన్ని రకాల సీతాకోకచిలుకలు మనం పట్టుకోవడం కోసం దగ్గరయ్యేటప్పుడు అవి మనకు అందకుండా ఎగురుతూనే ఉంటాయి. వాటిని పట్టుకోవడం కష్టమే.
సిల్వర్ లైన్స్ రకం సీతాకోకచిలుకలు తోకభాగము, తలభాగంలాగానే ఉంటాయి.
అవి తలకిందులుగా వాలుతాయి. తల భాగం కదాని పట్టుకుతిందామని అనుకుంటే తోకభాగాన్ని పక్షులు పొడిచినట్టవుతుంది. అప్పుడు వాటి రెక్కలలో కొంత భాగం తెగినా అవి అలాగే జీవిస్తాయి.
గ్లాడ్ - ఐ పుష్పిరౌన్ సీతాకోకచిలుకల రెక్కలు చూడటానికి మనిషి కళ్ళల్లా ఉంటాయి. అవి మెరుస్తూ కనిపిస్తాయి
శత్రువుల నుంచి తప్పుకోవడంకోసం వాటికి ఈ ఏర్పాటు ఉపయోగపడుతోంది.
ఆడ సీతాకోకచిలుకలు ఒకే సమయంలో వంద గుడ్లు పెడతాయి.
వర్షాకాలంలో సీతాకోకచిలుకలు తమను కాపాడుకోవడానికి ఆకుల అడుగుభాగంలోకి చేరుతాయి. అంటే ఐవి గొడుగులుగా ఉపయోగిస్తాయని గ్రహించాలి.
కొన్ని రకాల సీతాకోకచిలుకలు గుడ్ల నుంచి పురుగులై మారిన తర్వాత గూడు కట్టి ఏడాది వరకూ లోపలే ఉండి సరైన శీతోష్ణస్థితిలో అవి సీతాకోకలుగా మారుతాయి.
సీతాకోకచిలుకల జీవితకాలం పదిహేనురోజుల నుంచి ముప్పై రోజులవరకే.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి