అధిక రక్తపోటు తగ్గడానికి...; పి . కమలాకర్ రావు

 కొన్ని యాలకులు, పిప్పళ్ళు, జిలకర, శోంటి, ని పొడిగా చేసి అతిమధురం కూడా కలిపి నీళ్ళల్లో కలిపి , వేడి చేయాలి. అందులో తాటి బెల్లం కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. అధిక రక్తపోటు తగ్గుముఖం పడుతుంది.
2. నాలుగైదు నందివర్ధనం ఆకులు  కడిగి నీళ్లలో వేసి జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి మరిగించి చల్లార్చి తాగాలి. అధిక రక్తపోటు తగ్గిపోతుంది.
3. కడుపులో పుండు, అల్సర్ తగ్గడానికి...
 కొన్ని మెంతుల్ని  నీళ్లలో రాత్రంతా  నానబెట్టి మరో రోజు ఉదయం గుడ్డలో కట్టి పెడితే మొలకలు వస్తాయి. అందులో ఒక స్పూను కలబంద గుజ్జు  కలిపి ఆహారంతోపాటు గా తింటే
కడుపులో పుండు, అల్సర్ తగ్గుముఖం పడుతుంది. కడుపులో పుండు ఉన్నప్పుడు ఆకలితో ఉండకూడదు. ఏదైనా ఆహారం తినాలి. ముఖ్యంగా  కూరగాయలు, పళ్ళు ఎక్కువగా తినాలి.

కామెంట్‌లు