*ప్రేమ*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 96.ప్రేమ!
     మానని గాయం!
     ఆగని గేయం!
     ఆరని హృదయం!
      ఆగిన ఉదయం!
97.ప్రేమ!
      విచిత్రాల్లో విచిత్రం!
      అద్భుతాలకు అద్భుతం!
      ఆ చిత్రం కాన్వాస్ విశ్వం!
      ఆ శబ్దం మూలం ప్రణవం!
98.ప్రేమ!
      పరువానికి నగ!
      ప్రాయానికి సెగ!
       పసందైన వగ!
       అదో నిగనిగ!
99.ప్రేమ!
      పతికి సతి ఓ రతి!
      సతికి పతి రతిపతి!
      వయసు పైబడిన కొద్దీ!
      గుండెలు సుధాసంద్రాలే!
100. ప్రేమ!
         కైపు కాదు!
         దిగిపోవడానికి!
         కాచే ప్రాపు!
         ఎదిగిపోవడానికి!
            (కొనసాగింపు)

కామెంట్‌లు