*అజ్ఞాన చీకట్లు*:-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

చిన్న చిన్న పిల్లలు 
చూస్తూ వింటూ నేర్చెదరు 
అమ్మే తొలి గురువై
మాటలనే నేర్పేను

అక్క అన్న అవ్వాతాతలు 
మలి గురువులైనంత 
చిన్న చిన్న పదాలు 
నేర్పుతారు ఇష్టంగా 

పరిసరాలను చూస్తూనే 
నేర్చు కొనెదురు ఎంతో 
గురువే జ్ఞాన శిఖర మై
ఎన్నో విద్యలు నేర్పేను
కామెంట్‌లు