*అక్షర మాల గేయాలు**సంయుక్తాక్షర గేయం జ- ఒత్తు*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 అర్జున్ ఫర్జానా వాళ్ళు కలిసి
హైదరాబాద్ జూకు వెళ్ళారు
అమ్మ ఇచ్చిన ఖర్జూరాలు తింటూ
అంతట తిరుగుతూ చూశారు
చెట్టు కింద మార్జాలాన్ని చూసి
భలే భలే పులి అని అరిచారు
పులి కాదు పిల్లి అని తెలిసి
పకపకా నవ్వుతూ నడిచారు
దూరంలో సింహ గర్జనను విని
భయంతో వెనక్కి ఉరికొచ్చారు


కామెంట్‌లు