గణపయ్య (బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట

కడివెడు కుడుములు తెచ్చాము
గంప నిండా పెట్టాము
చిన్నగా మెల్లిగా రావయ్య
బొజ్జ నిండా తినవయ్యా

ఎలుగ పండ్లు తెచ్చాము
ఎదురుగుండా  పెట్టాము
ఎగురుకుంటూ రావయ్య
ఎలుగ పండ్లు తినవయ్యా

గుండ్రంగ ఉండ్రాళ్లు చేశాము
కుండ నిండా పెట్టాము
తీయని పాయసమొండాము
తికమక చేయక రావయ్య

పండ్లు ఫలాలు పెట్టాము 
పరుగు పరుగున రావయ్య
పెట్టిన వన్నీ తినవయ్యా
చల్లని దీవెనలియ్యు గణపయ్య

కామెంట్‌లు