హలిటోసిస్ ....!! >కవి.--డా.కె.ఎల్.వి.ప్రసాద్.> హన్మకొండ .

 తుఫానును తట్టుకోగలం ,
వర్షాలను స్వాగతించగలం ,
భూకంపాలను భరించగలం ,
వరదలను ఎదుర్కోగలం ...!
కానీ .....
ప్రజల మధ్యకొచ్చి 
తమగబ్బునోరు విప్పి ,
బూతుపురాణం వల్లించే 
బడుద్ధాయి కంపుగాళ్ళని 
అసలు తట్టుకోలేం !
అందుకే.....
వాడెంతటివాడైన 
తరిమితరిమి కొట్టాలి !
సరిహద్దులు దాటించాలి 
సంఘబహిష్కరణ చేయాలి !!
           ------------------------------ .
         *హలిటోసిస్=నోటిదుర్వాసన .

కామెంట్‌లు