వినాయక చవితి పండగ సందర్భంగా వ్యాసం.:-తాటి కోల పద్మావతి గుంటూరు.

 భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి జరుపుకుంటారు. ఈ రోజున గణపతిని పూజించుట ద్వారా సర్వ కోరికలు తీరి సుఖించే అవకాశం ఉన్నది. గణపతి విఘ్నములకు అధిపతి. ప్రతీ కార్యమునకు ముందు మనం గణపతిని ఆరాధించే అలవాటు ఉన్నది. అయితే వినాయక చవితినాడు ప్రత్యేకించి విశేషంగా పూజింపవలెను. తులసి, మారేడు, గన్నేరు,, ఉసిరి జిల్లేడు ఉమ్మెత్త గరిక నేరేడు దానిమ్మ వంటి పత్రములతో విశేషంగా పూజించి వినాయక చవితి కథను విని ఉండ్రాళ్ళ తో కూడిన పలు రకాలైన పిండివంటలను నివేదన చేయవలెను. కధా అక్షింతలు వేసుకోకుండా కథను వినకుండా ఉంటే వినాయక చవితినాడు చంద్రుని చూచిన వారికి అపనిందలు కలిగే అవకాశం ఉన్నది.
గణపతి పార్వతి తనయుడుగా అవతరించిన ఈ రోజును అందరూ గణపతి ఆరాధన చేసే సుఖించి గలరని భావన. వ్యాసమహర్షి మహాభారతాన్ని చెప్తూ ఉంటే గణపతి రాయటం పూర్తి చేసేవాడు. పార్వతి పిండితో బొమ్మను చేసి వాకిలి ముందు నిలబడితే పరమేశ్వరుని కూడా లోపలకి రానివ్వలేదు. శివుడు కోపంతో ఆ బాలుని శిరస్సుని ఖండించాడు. పార్వతీదేవి దుఃఖ పడగా ఏనుగు తలను అతికించి ప్రాణం పోసాడు ఏకదంతుడు గా పేరుపొందాడు ఒక దంతంతో 
 మూషికాసురుడు ని సంహరించాడు. పదునాలుగు లోకాలను చుట్టివచ్చి పార్వతీ పరమేశ్వరులకు ప్రణమిల్లి విఘ్నాలకు అధిపతిగా ఎన్నుకోబడ్డాడు. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని ప్రార్థించాలి. విద్యార్థులు పుస్తకాలను పెట్టి పసుపు కుంకుమ అక్షింతలతో పూజించాలి. వినాయకుని వ్రత కథ విధానం చదువుకొని పూజించి ఉండ్రాళ్ళు నివేదన చేయాలి. రాత్రికి మరలా నీలాపనింద కథ చదువుకొని అక్షింతలు వేసుకుంటే చంద్రుని చూసిన నీలాపనిందలు కలుగవు విద్యార్థులందరూ వినాయకుని ప్రార్థించి విద్యను అభ్యసించాలి  .

కామెంట్‌లు