టోక్యో ఆటలు - బాల గేయం :-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
టోక్యో  ఆటలు చూశారా 
పారాలింపిక్స్  కన్నారా 
భారత త్రివర్ణ పతాకం 
దివ్యము రెపరెప లాడిందీ!

అబ్బుర పరిచే నైపుణ్యం 
అనితర సాధ్యం ఈ పుణ్యం 
దివ్యాoగులకూ పతకాలు 
బంగారు వెండి కాంస్యాలూ!

లోపం తనువుకి మాత్రమనీ 
శాపం కాదని నిరూపణయి 
భారతదేశం గర్వించే 
క్రీడాకారులు వీరే నోయి!కామెంట్‌లు