సోగ్గాడి పెళ్ళాం బాల సాహిత్యం బులెటిన్ ఆవిష్కరణ


 నిజామాబాద్ : ప్రముఖ కవి రచయిత ఫ్రెండ్లీ పోలీస్ ఏఎస్ఐ తొగర్ల సురేష్ రచించిన  సోగ్గాడి పెళ్ళాం బాల సాహిత్యం బులెటిన్ ను నగర మేయర్ దండు నీతూ కిరణ్  రాజీవ్ గాందీ ఆడిటోరియంలో సురభి నాటకం శ్రీకృష్ణ లీలలు ప్రదర్శించే ముందు ఆవిష్కరించి మాట్లాడారు. నగర మేయర్ దండు నీతూ కిరణ్ సురభి నాటక కళాకారులను వారికి ప్రోత్సాహాన్ని, ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తోగర్ల సురేష్ అటు పోలీస్ ఉద్యోగంకు న్యాయం చేస్తూ సాహిత్య రంగంలో సమాజానికి కథల కవితల పుస్తకాల రూపంలో సేవలు అందించడంను మనస్ఫూర్తిగా అభినందింస్తున్నాను అని తెలిపారు.నిజ జీవితంలో వృత్తిలో ఎదురుపడే అంశాలపై కథలు, కవితలు రాయటం తోగర్ల సురేష్ కే చెల్లిందని అభివర్ణించారు. సురభి నాటకరంగ కళాకారులకు తన వంతు ఆర్థిక సహాయం అందచేయడం పట్ల తొగర్ల సురేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సురభి నాటకరంగ సాయి సంతోషి నాట్య మండలి వ్యవస్థాపక అధ్యక్షులు బాదంగిరి సాయి మూర్తి, శ్రీపాద నాటక కళా పరిషత్ నిజామాబాద్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పాద కుమార శర్మ, కవులు రచయితలు మల్లవరపు చిన్నయ్య, కాసర్ల నరేష్ కుమార్, మెజీషియన్ రంగనాథ్, మంజీరా హెల్పింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పురుషోత్తం రెడ్డి, కార్పొరేటర్ సిరిగాద ధర్మపురి, తోట రాజశేఖర్ వ్యాఖ్యాత గంగదాసు, దారం గంగాధర్, వందలాది కవులు రచయితలు, కళా పోషకులు కళా పిపాసకులు పాల్గొన్నారు.


కామెంట్‌లు