*సమాజాన్ని ప్రశ్నిస్తున్న గద్వాల్ జాతర*

 ఎన్జీఓ హోం, అనంతపురము, : సమాజంలోని అసమానతలు,  వివక్షత , పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ సమాజాన్ని  అభివృద్ధి వైపు నడిపించే కథలు " గద్వాల జాతర " పుస్తకంలో ఉన్నాయని అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

 ఆంధ్ర ప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీవో హోంలో ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించిన.              " గద్వాల్ జాతర " పుస్తకావిష్కరణ సభలో సభాధ్యక్షులుగా పాల్గొన్న రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి ప్రసంగిస్తూ డాక్టర్ కె నాగేశ్వర్ నిక్కచ్చితనం నిజాయితీ మార్క్సిజం భావాలు మెండుగా కలవాడని కొనియాడారు.
 
ఈ పుస్తకాన్ని పరిచయం చేసిన డాక్టర్ బావికాటి రాఘవేంద్ర ప్రసంగిస్తూ ఈ కథలు చదువుతుంటే ఉపాధ్యాయుల మనస్తత్వాలు, పిల్లల బాధలు ,విప్లవ ఉద్యమాల ఆవశ్యకత, ఒక శాస్త్రీయమైన మౌలిక ప్రశ్నలు ఉదయిస్తాయి. జానపద సంస్కృతి ఎలా యాంత్రికంగా అయిపోతుందో చర్చించే కథలు. ప్రాచీన కళలు ఎలా కనుమరుగవుతున్నాయో కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయన్నారు.
 గౌరవ అతిథిగా డాక్టర్ సత్యనారాయణ, బి. ఈశ్వర్ రెడ్డి, టి. రాజారాం తదితరులు ప్రసంగించారు.
పుస్తకాన్ని శ్రీమతి ఆర్ శశికళ చేతుల మీదుగా ఆవిష్కరించారు .
ఈ సభలో కంబదూరు షేక్ నబి రసూల్ ,ఆంధ్ర ప్రదేశ్ దేశ్ అభ్యుదయ రచయితల సంఘం అనంతపురం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నానీల నాగేంద్ర, డాక్టర్ తన్నీరు నాగేంద్ర , డాక్టర్ డి అనితమ్మ, మధుర శ్రీ,  కొత్త పల్లి సురేష్, కుంచె లక్ష్మీనారాయణ, షేక్ రియాజుద్దీన్, కటకం కృష్ణవేణి చంద్రశేఖర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు