కుంకుమ బొట్టు. తాటికోల పద్మావతి గుంటూరు.

 సావిత్రమ్మ తన కొడుకుని స్నానం చేయించి స్కూల్కి పంపిస్తూ నుదుటన కుంకుమ బొట్టు పెట్టింది. అబ్బాయిలకు ఎందుకు కుంకుమ అన్నాడు పదేళ్ల రాము. కుంకుమ ఎర్రగా ఉంటుంది కదా. మన జీవనజ్యోతి నీ నడిపించే రక్తం కూడా ఎర్రగానే ఉంటుంది. ఆ రంగు సూర్యశక్తిని ప్రతిబింబిస్తుంది. సూర్యశక్తిని తనలో లీనం చేసుకొని సూర్యుని వేడిని తాకనివ్వదు. కుంకుమను,నుదుటనే పెట్టుకొంటాము. శాస్త్రీయంగా చూస్తే మన మన శరీరంలోని 72వేల నాడులను కలుపుతూ మెదడుకు సంకేత స్థానంగా నిలిచి ఎప్పుడు మేల్కొనే ఉంటూ అత్యంత కీలకమైన సుషుమ్నా నాడీ కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. దాన్నే మన పూర్వులు జ్ఞాననేత్రం అన్నారు. ఈ ఈ శక్తివంతమైన జ్ఞాన నేత్రానికి పగ వారి నీ దృష్టి పడకుండా, సూర్యతాపం తగలకుండా, రక్త ప్రసరణ లా ద్వారా, ఆలోచన పరంపరల ద్వారా వేడి జన్మించి ఆ వేడి లో జ్ఞాననేత్రం కరిగిపోకుండా ఎప్పుడు ఆ ప్రదేశాన్ని చల్లగా ఉంచడానికి అక్కడే ఎప్పుడు కుంకుమ ధరించాలి.
హిందువైన ప్రతి వ్యక్తి తమ తమ మత సంబంధమైన నా గుర్తులను ముఖాన తప్పక ధరించడం హిందూ ధర్మ ప్రత్యేకత. భగవంతున్ని పూజించేటప్పుడు గంధం అక్షతలు తప్పక సమర్పించే సంప్రదాయం అనాదిగా ఉంది.
కొందరు విభూతి, గంధం, నామాలు, గోపీచందనం, ముద్రలు, గంధం అక్షతలు భరిస్తారు. కొందరు కుంకుమ పెట్టుకుంటారు. ఇవన్నీ నీ వాళ్ళ వాళ్ళ అ ఆచారాన్ని సూచించేవి మాత్రమే కావు. వీటిలో వైజ్ఞానిక విశేషాలున్నాయి. తల్లి చెప్పిన మాటలు విని ప్రతిరోజు స్కూల్ కి వెళ్లేటప్పుడు కుంకుమ పెట్టుకుని వెళ్లటం అలవాటు చేసుకున్నాడు రాము.

కామెంట్‌లు