డాక్టర్ అడిగొప్పుల సదయ్యనుకు "కవనశ్రీ చక్రవర్తి, కవిచక్ర" బిరుదుల ప్రదానం

  శ్రీ మల్లినాథసూరి కళాపీఠం-ఏడుపాయల సంస్థాన్,మెదక్ జిల్లా వారి "కవుల మహామేళా" ఏడుపాయల వనదుర్గాదేవి దేవాలయం ఆవరణలోని గోకుల్ హాలులో వైభవంగా ఏర్పాటుచేశారు.ఈసమావేశంలో తెలుగు రాష్ట్రాలనుండి సుమారు 200 మంది కవులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మల్లినాథసూరి కళాపీఠం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్గా వ్యవహరిస్తు సుమారు 20మంది కరీంనగర్ జిల్లాకు చెందిన కవులచేత 105 చొప్పున కవితలు రాయించిన   డాక్టర్ అడిగొప్పుల సదయ్యను కళాపీఠం జాతీయ అధ్యక్షులు శ్రీ అమరకుల దృశ్యకవిచక్రవర్తిగారు,తెలంగాణా సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి శ్రీ ఏనుగు నరసింహరెడ్డి గారు మరియు ప్రముఖ సంస్కృత అవధాని శ్రీ అయాచితం నటేశ్వరశర్మ గారలు "కవనశ్రీ చక్రవర్తి మరియు కవిచక్ర" బిరుదులను ప్రదానంచేసి దుశ్శాలువ ,ప్రశంసాపత్రం, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో సదయ్య ఆధ్వర్యంలో మనజిల్లానుండి 12 మంది కవయిత్రులు పాల్గొని "కవిచక్ర" బిరుదులు అందుకున్నారు.మనజిల్లానుండి యాంసాని లక్ష్మీ రాజేందర్,భవానీశర్మ, జ్యోతిరాణి,దొంతరాజు విజయలక్ష్మి, పబ్బ జ్యోతి,రజిత,అనూశ్రీ,భాగ్యలక్ష్మి మొదలగు కవులు పాల్గొన్నారు."కవనశ్రీ చక్రవర్తి బిరుదు"నందుకున్న శ్రీ సదయ్యను కరీంనగర్ జిల్లాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కనుమల్ల విజయ గణపతి,వావిలాల గ్రామసర్పంచ్ శ్రీమతి జక్కెన శ్రీలతాసత్యం,MPTC సభ్యుడు శ్రీ మర్రి మల్లేశం,SMC చైర్పర్సన్ శ్రీమతి మామిడి శ్రీలత రవి,జి.ప.ఉ.పా.ప్రధానోపాధ్యాయులు శ్రీ కే పి నరేందర్ రావు,ఉపాధ్యాయులు అభినందించారు.

కామెంట్‌లు