*బాలనరేంద్రుడు*("రాజశ్రీ" కవితా ప్రక్రియ లో):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 1)
ఊరిలోన తిరునాళ్ళు జరుగుతుండె
అందరూ తిరునాళ్ళు దర్శించుచుండె
బాలుడొకడు మిత్రునితో కలిసివెళ్ళె
తిరునాళ్ళంతా కలయతిరిగి మదినితుళ్ళె!
2)
ఒకచోట చూశాడు బొమ్మలంగడి
అందమైన బొమ్మలెన్నొ ఉన్నాయండి
తీరొక్క రంగులతో మెరుస్తున్నాయి
మనసులోన కోరికలు కొనమన్నాయి!
3)
బాలుడొక్క శివునిబొమ్మ కొన్నాడు
భక్తితోడ పరవశం చెందాడు
నేస్తాలు తీర్థమంత తిరిగిచూశారు
మదినిండా సంతోషం నింపుకున్నారు!
4)
నలుదిక్కుల చీకట్లు అలుముతుండగా
నేస్తాలిద్దరు ఇంటికి వెళ్ళుచుండగా
చూసిన వింతలన్ని మననంచేస్తున్నారు
శివునిబొమ్మతో ఇంటికి పయనమయ్యారు!
(సశేషము)

కామెంట్‌లు