బాల గేయం- చీమ:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 చీమ ఎంతో చిన్నది
తెలివి భలే ఉన్నది
పొదుపులోన ఎప్పుడూ
తానే ముందున్నది
క్షణమైనా రికాము లేక
పని చేస్తూనే ఉంటుంది
శ్రమ జీవన సౌందర్యానికి
 తానే మూలమైనది
సహజీవనం స్నేహానికి
విలువ ఎంతో ఇస్తుంది
సుశిక్షిత సైనికుడిలా
క్రమ శిక్షణ పాటిస్తుంది
పంచుకోవడంలోనే
ఆనందం ఉందంటుంది
ప్రజావళికి తానెప్పుడూ
మార్గ దర్శియై నిలుస్తుంది

కామెంట్‌లు