మిర్చిబజ్జీ:-....డాక్టర్ బెజ్జంకి. మాచర్ల
మిర్చి బజ్జీ  చరిత్రను మీరు వినుడు
చెప్పుచున్నాడు బెజ్జంకి చిత్రముగను

పచ్చిమిర్చి పగలగోసి వాముపెట్టి
శనగపిండికలిపిముంచి శనగనూనె
లోన వండి ఉల్లి తరుగులోనపెట్టి
కొద్దిగ మసాల తో తిన్నకొద్ది తినుడె
నిమ్మ రసము పిండిన యింక కమ్మనౌను
ఎన్ని వేడి బజ్జీలైన ఇంపుగుండు
తిన్నవారి కంటను నీరు తిరుగు చుండు
మండినా నోరు తింటారు మరల మరల
మిరప బజ్జీలు రుచిలోన మిన్నగనుక.
బజ్జి లందు రాజు మిరప బజ్జియెకటె.
వేడి వేడి బజ్జి నెవరు విడువలేరు
కారమైన నుఫూయంటు కొరుకుతారు
అబ్బదాని రుచే వేరుహాయి హాయి
ఆలు,వంకాయ బజ్జీలు అరటి బజ్జి
అన్నిబజ్జీల రుచికన్న మిన్న మిర్ఛి
అబ్బ పులిహోర బజ్జీల దెబ్బవేరు
                          ..


కామెంట్‌లు