కాలేయం వాపు - నివారణ:- పి . కమలాకర్ రావు

  అధికంగా నూనె పదార్థాలు  తిన్నా, కారం ఎక్కువగా తిన్నా కాలేయానికి నష్టం వాటిల్లుతుంది. ఆహారంలో నూనె పదార్థాలు వాడటం తగ్గించుకోవాలి.
 బొప్పాయి పండును ముక్కలుగా కోసి, ఒక గిన్నెలో వేసి నీరు పోసి కొద్దిగా జిలకర వేసి కషాయంగా కాచి త్రాగాలి.
 ఇది కాలేయం వాపును తగ్గిస్తుంది. కాలేయం బలపడుతుంది.
2. ఉల్లిపాయలు పేస్టు తయారు చేసి, మిరియాల పొడి వేసి, నీరు పోసి కషాయంగా కాచాలి. ఈ కషాయం త్రాగినా కూడా కాలేయం వాపు  తగ్గిపోతుంది.
3. కొన్ని నేరేడు పళ్ళు తెచ్చి గింజలు తీసి వేసి, సొంటి పొడి వేసి, నీరు పోసి  కషాయంగా కాచాలి. ఇది కాలేయంలో కొవ్వును పెరగ నివ్వదు..
4. నీటిలో నిమ్మరసం పిండి  కొద్దిగా ఉప్పు కలిపి త్రాగితే కాలేయానికి క్రమక్రమంగా శక్తి పెరుగుతుంది..
.
కామెంట్‌లు