*చదువుల తల్లి*పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

చదువుల గుడులు తెరిచారు
విద్యార్థులంతా కలిసారు
గురువుల చెంతకు చేరారు
అక్షర సన్నిధి మురిసారు

మిత్రుల చదువులు అడిగారు
కరోనా ను తిట్టి పోశారు
పట్టుదలని పెంచాలన్నారు
పుస్తకాల నే తెరిచారు

గురువుల బోధన విన్నారు
తిరిగి చదువుతా మన్నారు
కరోన తోకను నరికారు
చదువుల తల్లి ని కొలిచారు
కామెంట్‌లు