వినాయకుడు:-పెందోట వెంకటేశ్వర్లు

విజయాలను తెచ్చును
విఘ్నాలను తరుమును
తల్లిదండ్రులనే మొక్కును
ఎలుక వాహనమెక్కును

మాతా పార్వతి మాటలను
తప్పకుండా వినును
తండ్రితో యుద్ధం చేసెను
ప్రాణాలనే కోల్పోయెను

ఆమే శివుని కోరెను
గజముఖుడై లేచెను
గణాలకధ్యక్షుడాయెను
వినయాలనే పంచును
కామెంట్‌లు