భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ బాలల కవితల పోటీ

 భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని బాలల్లో సాహిత్య అభిరుచి పెంపొందించి, తద్వారా వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయాలనే  ఉదేశ్యం   తో  ఉభయ తెలుగు రాష్ట్రాలకు  చెందిన అన్ని రకాల పాఠశాలల్లో చదువుచున్న విద్యార్థుల నుండి అక్షర సేద్యం ఫౌండేషన్  కవితలు ఆహ్వానిస్తోంది. విద్యార్థులు  తమకు నచ్చిన అంశంపై 20 వరుసల కు మించకుండా వ్రాసి పంపాలి.వచ్చిన కవితల నుండి 75 ఉత్తమ కవితలను ఎంపిక చేసి ,ప్రతి విజేతకు 100 రూపాయల విలువ గల సాహిత్య పుస్తకాలు,ప్రశంస పత్రం బహుకరిస్తామని,75 కవితలతో సంకలన పుస్తకం కూడా రూపొందిస్తామని  అక్షర సేద్యం ఫౌండేషన్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు భైతి దుర్గయ్య,వేల్పుల రాజు చెప్పారు.  విద్యార్థులు తాము వ్రాసిన కవితలను  హామీ పత్రంతో పాటు"కన్వీనర్, వజ్రోత్సవ కవితల పోటీ, అక్షర సేద్యం ఫౌండేషన్ గ్రా,, రామునిపట్ల, సిద్దిపేట జిల్లా -502267 చిరునామా కు  2021 అక్టోబరు 20వతేదీలోగా  స్వయంగా, లేదా వాట్సప్ ద్వారా (9701933704) పంపగలరు.పూర్తి వివరాలకు 9701933704 సెల్ నంబర్ లో సంప్రదించవచ్చు నని తెలిపారు.
కామెంట్‌లు