జ్ఞాపికలు - బాల గేయం :-ఎం. వి. ఉమాదేవి - నెల్లూరు

బొమ్మలూ జ్ఞాపికలూ 
అందంగా ఉంటాయి 
సాధించిన విజయానికి 
గుర్తుగానే నిలుస్తాయి !

ఆటలు పాటల్లోనూ 
మేటిగాను ఉండాలి 
ప్రయత్నమే సాధనగా 
ప్రతిభను చూపించాలి!

కుటుంబం అంతా మన
తెలివికి సంతోషంతో 
మరింతగా ప్రోత్సాహం 
అందేలా శ్రమించాలి!

పుస్తకాలు బహుమతిగా 
ఎంతో జ్ఞానం పంచును 
పుట్టినరోజు కానుకగా 
పుస్తకాలు మేలు అగును!

ఆకాశమే హద్దులుగా 
అన్నిటిలో పాల్గొనాలి 
సభల్లోన జంకులేక 
మాట్లాడటం తెలియాలి!

కామెంట్‌లు