తెలివైన భీం.:-D. రాఘవేనిZphs ఇందిరానగర్ , సిద్ధిపేట

 అనగనగనగా పూర్వం శివపురం అనే ఒక ఊరు. ఆ ఊరిలో ఒక అందమైన ఉమ్మడి
కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎంతో ఆనందంగా మరియు అద్భుతంగా ఉండేది. ఆ కుటుంబం వారు ఎప్పుడు ఉన్నదానిలోనే ఆనందంగా ఉండేవారు. ఆ కుటుంబంలో రాజు.. అతని భార్య లక్ష్మి మరియు వారి కొడుకు శామ్ ఉండేవారు. వారు పేదవారు అయినప్పటికీ ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉండేవారు. రాజుకు మూడు ఎకరాల పొలం ఉంది అయితే ఆ పోలంలో రాజు మరియు అతని కొడుకు శామ్ పంటలు పండిస్తారు / వ్యవసాయం చేస్తారు. రాజు భార్య లక్ష్మి ఇంట్లోనే పని చేస్తు కుటుంబానికి సహాయపడేది. ఒక రోజు ఉదయం సూర్యుడు కాంతితో ఉదయిస్తున్నాడు రోజులాగే రాజు అతని కొడుకు పోలానికి వెళ్ళారు అక్కడ పొలం దున్నడం మొదలుపెట్టారు. కొంత సమయానికి పొలం పని పూర్తి చేశారు. పని పూర్తికాగానే ఇంటికి వెళ్ళారు. కొన్ని ఏళ్ళు గడిచాయి. శామ్ యువకునిలా మారాడు అతడికి పెళ్ళి చేసుకునే వయస్సు వచ్చింది అయితే అతని  తల్లిదండ్రులు శామ్ కు ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అమ్మాయి మరియు వ్యవసాయం తెలిసిన అమ్మాయిని తెచ్చి శామ్ కు పెళ్ళిచేయాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే, శామ్ కు రమ అనే అమ్మాయితో వివాహం చెసారు. ఐదేళ్ళ తరువాత రమ ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. అతని పేరు భీమ్ చాలా సంవత్సరాలు గడిచాయి భీమ్ పెద్దవాడు అయ్యాడు అతని చదువుకోసం వేరే ఊరికి వెళ్ళాడు. అనుకోకుండా భీమ్ నాయినమ్మ లక్ష్మి మరణించింది. ఆ తరువాత భీమ్ తల్లిదండ్రులు రోజులాగే, పొలానికి వెళ్ళారు. పని పూర్తిచేసుకున్నారు. కొన్ని రోజులకు శామ్ తండ్రి రాజు మంచానపడ్డాడు. అంతేకాదు అతనికి బాగా జ్వరం వచ్చింది. అంతే కాదు తీవ్రంగ దగ్గు లేసింది.అప్పట్లో రాజు చుట్టుకాలిచెవాడు దాని ద్వారానే అతనికి జ్వరం వచ్చింది మరియు దగ్గుకు గురైయాడు అయితే, అతడి నుండి ఒక వాసన వచ్చేది. ఆ వాసన రమకు నచ్చలేదు. అయితే, ఆమె రాజుకు ఒక చిన్న గుడిలసను ఏర్పాటుచేసింది. అతనికి ఒక మట్టితో తయారుచేసిన పాత్ర తినడానికి ,ఒక కుండ తాగటానికి ఇచ్చింది. అయితే, రాజు ఆ గుడిసలోనే ఎండనక, వాననక జీవిస్తున్నాడు. రోజులాగే, శామ్, రమ పొలానికి వెళ్ళారు కొంత సమయానికి భీమ్ ఊరినుండి వచ్చాడు. రాగానే అతడు ఇంట్లోకి వెళ్ళి చూసాడు ఇంట్లో ఎవరు లేరు. బయటకు రాగానే భీమకు ఒక్క చిన్న గుడిస కనిపించింది. భీమ్ అక్కడికి వెళ్ళాడు. అందులో అతడి తాతయ్య రాజుని చూసి ఆశ్చర్యపోయాడు. భీమ్, రాజును పలకరించాడు. "తాతయ్య ఏలా ఉన్నావు? అని అడిగాడు భీమ్ అయితే రాజు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు? భీమ్ తాతయ్య,నేను భీమని నీ మనవడిన
అని ప్రేమతో చెప్పాడు...
అయితే, రాజు భీంను దగ్గరికి తీసుకొని ప్రేమగా ముద్దు పెట్టాడు.. అయితే, భీమ్ రాజును "తాతయ్య నువ్వు ఇంటిని వదిలిపెట్టి, ఈ గుడిసలో ఎందుకుంటున్నావు? అని అడిగాడు భీమ్ అప్పుడు రాజు జరిగిందంత వివరించాడు. ఆ మాటలు విని భీమ్ ఆలోచనలో పడ్డాడు. తన తల్లిదండ్రులకు ఎలాగైన గుణపాఠం చెప్పాలి అని అనుకున్నాడు. అనుకున్నట్టుగానే భీమ ఆలోచించాడు. అప్పుడు భీం కు ఒక ఉపాయం తట్టింది. ఆ ఉపాయాన్ని రాజుకు వివరించాడు. అది,"తాతయ్య అమ్మ నీకు అన్నం తీసుకొని రాగానే నువ్వు ఆ మట్టి పాత్రను పట్టు అందులో అమ్మనీకు అన్నం పెడుతుంది పెట్టగానే ఆ పాత్రను కింద పడేయి." ఆ తరువాత నేను చూసుకుంటాను అని భమ్ చెప్పాడు. రాజు దానికి అంగీకరించాడు భీమను ఇంట్లోకి వెళ్ళమన్నాడు. భీం ఇంట్లోకి వెళ్ళి అన్నం తిన్నాడు. తినగానే బయటకు వచ్చాడు. కొంత సేపటికి భీమ్ తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు భీమ్ ను  పలకరించారు. ఆ తరువాత రోజులాగే రమ రాజుకు అన్నం తీసుకొని వెళ్ళింది రాజు ఆ మట్టి పాత్ర పట్టాడు. అన్నం పెట్టగానే ఆ పాత్రను కింద పడేసాడు. అది చూసిన రమ రాజును బాగా తిట్టింది మరియు అతడిపై అరిచింది. ఇదంత గమనించిన భీమ్ ఏమి తెలవనట్టుగా వచ్చాడు అయతే భీమ్ ఏమన్నాడంటే "ఓరేయ్ ముసలోడు! మంచి మట్టి పాత్రను నేలపాలు చేసావు కదా! రేపటి నుండి ఎలా తింటావు? ఆ మట్టి పాత్రను పడేసావు ఎందుకు పడేసావు? రేపు నువ్వు చనిపోయిన తరువాత ఆ పాత్రను దాచిపెట్టాలని అనుకున్నాను. నాకు పెళ్ళైన తరువాత మా తల్లి తండ్రులు. దేంట్లో తింటారు. నేను వారికి అన్నం దేంట్లో పెట్టాలి నువ్వు ఆ మట్టి పాత్రను పగలగొట్టావు" అని తిట్టాడు. ఆ మాటలు విన్న రమ మరియు శామ్ వారి తప్పును తెలుసుకున్నారు. రాజును ఇంట్లోకి రమ్మన్నారు మరియు అందరు కలసి ఆనందంగా జీవించారు....
భీమకు కృతజ్ఞతలు చెప్పారు.......
నీతి: మనం మన తల్లితండ్రులను తప్పక గౌరవించాలి వారికి సేవచేయాలి అంతే కాదు, "మానవ సేవే మాధవ సేవ" అని మన పెద్దలు అన్నారు. కాబట్టి తల్లితండ్రులకు సేవ చేయాలి. వారు మనకు కనిపించే దేవుళ్ళు. కాబట్టి అన్ని సేవలకెళ్ళు తల్లితండ్రుల సేవ ఎంతో గొప్పది"

కామెంట్‌లు